Share News

రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ABN , Publish Date - Jun 04 , 2026 | 08:26 PM

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. మొత్తం 11 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది.

రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Satish Poonia, Tarun Chug

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ ఎన్నికలు, ఒడిశా ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది. మొత్తం 11 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది.

రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా సతీశ్ పూనియా, అల్కా గుర్జర్, మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీశ్ అగ్రవాల్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయ్ తాగాక్, మణిపూర్ నుంచి శారదా దేవిని బరిలోకి దింపింది. గుజరాత్ నుంచి రాజూభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాఠ్వా, మాన్‌సింగ్ పర్మార్, జితేంద్రసింగ్, మేఘ్‌జీభాయ్ కంజారియా బరిలో నిలిచారు. ఇక ఒడిశా రాజ్యసభ ఉపఎన్నికలో దేబాశిష్ సామంతరాయ్‌ను బీజేపీ రంగంలోకి దించింది.


జూన్ 18న ఎగువ సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు అంటున్నారు. 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యా బలం 148కాగా, బీజేపీ ఎంపీలు 113 మంది ఉన్నారు.

ఇక రాజ్యసభ ఎంపీలు హర్దీప్ సింగ్ పురీ, దినేశ్ శర్మ, అరుణ్ సింగ్, ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్‌ల పదవీ కాలంలో కూడా నవంబర్‌లో పూర్తికానుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇండియా కూటమి భేటీకి నై.. డీఎంకే సంచలన నిర్ణయం

అగ్నిప్రమాదం.. భవనం నుంచి బాధితులు దూకుతుంటే.. కింద పరుపులను పేర్చి..

Updated Date - Jun 04 , 2026 | 09:04 PM