బీజేడీ రాజ్యసభ ఎంపీ సమంతరాయ్ రాజీనామా, బీజేపీలో చేరే ఛాన్స్
ABN , Publish Date - May 25 , 2026 | 02:56 PM
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు.
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD)కు మరో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ (Debasish Samatray) సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడుగా సమంతరాయ్‌కి పేరుంది.
రాజీనామా అనంతరం సమంతరాయ్ మాట్లాడుతూ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు ఈరోజు ఉదయమే లేఖ రాశానని చెప్పారు. ఆ వెంటనే రాజ్యసభ వైస్ చైర్మన్‌ను కలిసి రాజ్యస సభ్యత్వానికి రాజీనామా లేఖను అందజేసినట్టు చెప్పారు. జాతీయ స్థాయిలో అవిభక్త కటక్ జిల్లాకు, ఒడిశాకు సేవలందించేందుకు రాజ్యసభకు తనను నామినేట్ చేసిన నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సమంతరాయ్ కంటే ముందు జేడీయూ రాజ్యసభ ఎంపీలు సుజీత్ కుమార్, మమతా మహంతలు ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ టిక్కెట్టుపై ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా సమంతరాయ్ రాజీనామాతో రాజ్యసభలో బీజేపీ బలం ఐదుగురు సభ్యులకు తగ్గిపోయింది. కాగా, సమంతరాయ్ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని, ఆయన చేరగానే పార్టీ మద్దతుతో తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతారని తెలుస్తోంది.
కాగా, సమంతరాయ్ రాజీనామాపై బీజేపీ ఎంపీ రబీంద్ర నారాయణ్ బెహరా మాట్లాడుతూ, ప్రస్తుతం ఒడిశాలో బీజేడీ ఒక్కో విక్కెట్ కోల్పోతోందని అన్నారు. బీజేడీ హయాంలో సుపరిపాలని అందించలేదని, పార్టీలో అందరూ ఉక్కిరిబిక్కరవుతున్న పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందని అన్నారు. సమంతరాయ్ బీజేపీలో చేరవచ్చని అనుకుంటున్నామని, ఆయన పార్టీలో చేరితో ఆయనకు సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బహిరంగ నమాజ్, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు
ఇంధన ధరల పెంపు.. ప్రధానిపై రాహుల్ గాంధీ ధ్వజం