Share News

ప్రపంచంలోనే గొప్ప నిధి.. తాజ్‌మహల్ అందానికి మార్కో రుబియో ఫిదా..

ABN , Publish Date - May 25 , 2026 | 01:40 PM

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తాజ్‌మహల్ అందానికి ఫిదా అయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కొద్ది సేపటి క్రితం సందర్శించారు. ఆయనతో పాటు భార్య జెనెట్ రుబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు.

ప్రపంచంలోనే గొప్ప నిధి.. తాజ్‌మహల్ అందానికి మార్కో రుబియో ఫిదా..
Marco Rubio Taj Mahal

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తాజ్‌మహల్ అందానికి ఫిదా అయ్యారు. భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కొద్ది సేపటి క్రితం సందర్శించారు. ఆయనతో పాటు భార్య జెనెట్ రుబియో, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు (Marco Rubio Taj Mahal).


తాజ్ మహల్‌ వద్ద దాదాపు గంటన్నర పాటు గడిపిన రుబియో దంపతులు సందర్శకుల పుస్తకంలో ప్రత్యేక సందేశం రాశారు. 'ప్రపంచంలోనే గొప్ప సంపదను సందర్శించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు' అంటూ రుబియో దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కో రుబియో నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే (Marco Rubio India tour).


ఇప్పటికే ఆయన కోల్‌కతా, న్యూఢిల్లీ పర్యటనలు పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ‌జైశంకర్‌తో కీలక చర్చలు జరిపారు (India US relations). మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భారత పర్యటనను పూర్తి చేసుకుని అమెరికాకు పయనమవుతారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Updated Date - May 25 , 2026 | 01:42 PM