Share News

విద్యార్థులపై ఏకే47తో కాల్పులు

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:50 AM

విద్యావ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా జూలై 25న నిర్వహించిన ‘బిహార్‌ బంద్‌’ నిరసనలో విద్యార్థులపై ఓ కానిస్టేబుల్‌ ఏకే47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన..

విద్యార్థులపై ఏకే47తో కాల్పులు

  • వీడియో వైరల్‌.. బిహార్‌లో కానిస్టేబుల్‌పై వేటు

పట్నా, జూలై 27: విద్యావ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా జూలై 25న నిర్వహించిన ‘బిహార్‌ బంద్‌’ నిరసనలో విద్యార్థులపై ఓ కానిస్టేబుల్‌ ఏకే47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో నిరసన చేస్తున్న విద్యార్థులకు, పోలీసులకు నడుమ తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. విద్యార్థులు పోలీసులపై రాళ్ళు రువ్వితే, పోలీసులు విద్యార్థులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి లాఠీచార్జి చేశారు. అదే సమయంలో నిరసనకారులను అదుపు చేయడానికి అభిషేక్‌ పటేల్‌ అనే ఓ కానిస్టేబుల్‌ ఏకే47తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు చెబుతున్నప్పటికీ ముగ్గురికి గాయాలయ్యాయని సమాచారం. ఇందులో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడని, బంద్‌ కారణంగా తను పని చేసే షాప్‌ మూసేసి ఇంటికి వెళ్తుండగా అతడి మెడకు బుల్లెట్‌ తగిలిందని స్థానిక మీడియా తెలిపింది. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వివరించింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. విద్యార్థులపై ఎట్టిపరిస్థితుల్లో కాల్పులు జరపకూడదని తాము పోలీసులను ముందే ఆదేశించామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 05:50 AM