Share News

భారతీయ వాయుయాన్ నియమ్-2026 విడుదల.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..

ABN , Publish Date - Nov 02 , 2026 | 07:35 PM

భారత విమానయాన రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, దేశ గగనతలంలో ప్రయాణించే విదేశీ విమానాలకూ నూతన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు ‘భారతీయ వాయుయాన్ నియమ్-2026’ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

భారతీయ వాయుయాన్ నియమ్-2026 విడుదల.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
Indian Aviation Rules 2026

ఢిల్లీ: భారత విమానయాన రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, దేశ గగనతలంలో ప్రయాణించే విదేశీ విమానాలకూ నూతన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు ‘భారతీయ వాయుయాన్ నియమ్-2026’ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నిబంధనలు 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.


కొత్త నిబంధనల ప్రకారం.. కమర్షియల్, ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్సులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ల (AME) లైసెన్సుల కాలపరిమితిని 10 ఏళ్లుగా నిర్ణయించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) లైసెన్స్ గరిష్ఠంగా 60 ఏళ్ల వయస్సు వరకు చెల్లుబాటులో ఉంటుంది. విమానంలో సిబ్బందిపై దాడి చేసినా, బెదిరించినా, మద్యం లేదా మత్తుపదార్థాలు సేవించి భద్రతకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా విమానాశ్రయాల్లో లేదా ఎగురుతున్న విమానాల నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయడంపైనా నిషేధం విధించారు.


అలాగే, ఆయుధాలు, పేలుడు పదార్థాల విషయంలోనూ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. డీజీసీఏ (DGCA) ముందస్తు అనుమతి లేకుండా విమానాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణాపై పూర్తి నిషేధం విధించారు. భారత భూభాగంపై ధ్వని కాలుష్యాన్ని (Sonic Boom) సృష్టించే పౌర విమానాల ప్రయాణాన్ని కొత్త నిబంధనల ప్రకారం నిషేధించారు. కేప్‌టౌన్ ప్రోటోకాల్ ప్రకారం, ఐడీఈఆర్‌ఏ (IDERA) హోల్డర్ దరఖాస్తు చేసిన ఐదు పని దినాల్లోనే విమానాల డీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కాగా, విమానాలు, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కేంద్రం ఈ నూతన నిబంధనలు తీసుకువచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటన.. హైకోర్టుకు న్యాయవాదులు..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

Updated Date - Nov 02 , 2026 | 07:55 PM