బెంగళూరులో భారీ నగదు పట్టివేత.. కారులో రూ.9 కోట్లు సీజ్
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:10 PM
బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.9 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న సుమారు రూ.9 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఈ నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
బెంగళూరు నుంచి నగదును తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నగదును తూత్తుకుడికి తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో సచిన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read:
నటుడిపై దాడి ఘటన.. దర్శకుడిపై కేసు నమోదు..
105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. జీవిత ఖైదు రద్దు..