నటుడిపై దాడి ఘటన.. దర్శకుడిపై కేసు నమోదు..
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:36 PM
బాలీవుడ్ నటుడు, లాపతా లేడీస్ సినిమా ఫేమ్ సతేంద్ర సోనీపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని ఓశివారా పోలీసులు 'పేడ్ పాల్కీ' చిత్ర దర్శకుడు పుష్పేంద్ర రమ్లాఖాన్ సింగ్‌తో పాటు ఆయన భార్య ప్రగతి చౌహాన్లపై కేసు నమోదు చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, లాపతా లేడీస్ సినిమా ఫేమ్ సతేంద్ర సోనీపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని ఓశివారా పోలీసులు 'పేడ్ పాల్కీ' చిత్ర దర్శకుడు పుష్పేంద్ర రమ్లాఖాన్ సింగ్‌తో పాటు ఆయన భార్య ప్రగతి చౌహాన్లపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్స్ 115(2), 127(3), 351(2), 352, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు ఏం జరిగిందంటే..
'లాపతా లేడీస్', 'మీర్జాపూర్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సతేంద్ర సోనీ.. పుష్పేంద్ర రమ్లాఖాన్ సింగ్ దర్శకత్వంలో 'పేడ్ పాల్కీ' సినిమా చేయడానికి సైన్ చేశారు. జూన్ నెలలో మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో 'పేడ్ పాల్కీ' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయనకు 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వగా.. మిగిలిన మొత్తాన్ని షూటింగ్ సమయంలో ఇస్తామని మేకర్స్ చెప్పారు. అయితే, 8 రోజుల షూటింగ్ ముగిసిన తర్వాత సోనీ తన బాకీ డబ్బుల గురించి అడగడంతో వివాదం మొదలైంది.
ఈ నేపథ్యంలోనే సోనీ వెక్కి వెక్కి ఏడుస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. డబ్బులు అడిగినందుకు ఆగ్రహించిన దర్శకుడు పుష్పేంద్ర, ఆయన భార్య ప్రగతి చౌహాన్ తనపై భౌతికంగా దాడి చేశారని ఆ వీడియోలో పేర్కొన్నారు. చంపేస్తామని బెదిరించారని, ఫోన్ లాక్కుని బలవంతంగా కారులోకి తోశారని సోనీ ఆవేదన వ్యక్తం చేశారు. సోనీ షేర్ చేసిన ఈ వీడియో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి
ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు
105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. జీవిత ఖైదు రద్దు..