Share News

105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. జీవిత ఖైదు రద్దు..

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:45 PM

హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. జీవిత ఖైదు రద్దు..
Supreme Court

ఇంటర్‌నెట్ డెస్క్: హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మల్ద జిల్లాకు చెందిన రసిక్ చంద్ర మొండల్ 1920లో జన్మించారు. 1988లో మర్డర్ కేసులో ఆయన జైలు పాలయ్యారు. 1994లో కోర్టు అతడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.


తనకు పడ్డ శిక్షను సవాల్ చేస్తూ మొండల్ 2018లో కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. తర్వాత అపెక్స్ కోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా మొండల్‌కు నిరాశే ఎదురైంది. దీంతో మొండల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వయసును దృష్టిలో ఉంచుకుని శిక్షా కాలం ముగియటానికంటే ముందే తనను రిలీజ్ చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2024 నవంబర్ 29వ తేదీన మొండల్‌కు మధ్యంతర బెయిల్ మంజూర్ చేసింది.


శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టు‌లో మొండల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ వయసును దృష్టిలో ఉంచుకుని కేసును ముగిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మిగిలిన శిక్షాకాలాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుతో 105 ఏళ్ల వయసులో రసిక్ చంద్ర మొండల్ జీవిత ఖైదు నుంచి విముక్తి పొందారు.


ఇవి కూడా చదవండి

కపుల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ టిప్స్‌తో గొడవలకు చెక్ పెట్టండి!

సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం

Updated Date - Aug 21 , 2026 | 06:05 PM