ఇంట్లో ఫ్రిజ్ పేలి నలుగురి మృతి
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:15 AM
గణేశ్ ఉత్సవాలను సంబరంగా జరుపుకుని, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేసి.. ఆనందంగా నిద్రించిన ఓ కుటుంబం...
బెంగళూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గణేశ్ ఉత్సవాలను సంబరంగా జరుపుకుని, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేసి.. ఆనందంగా నిద్రించిన ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడంతో కుటుంబంలో నలుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా ఆ ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో ఎవరికీ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. కర్ణాటక రాష్ట్రం బెళగావి నగరంలో ఘటన చోటుచేసుకుంది. చౌహాట వీధిలో గజానన ధమోనా నివాసంలో సోమవారం అర్ధరాత్రి పేలుడు సంభవించి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక, విద్యుత్, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో ఉన్నవారిలో ఇద్దరిని మాత్రమే రక్షించగలిగారు.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News