కాళ్లు పట్టుకుంటా, పక్కకు వచ్చేయ్.. తల్లి ఎంత వేడుకున్నా వినలేదు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:25 PM
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. దేవలై సతారాకు చెందిన 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఖవడ్యా కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తల్లి సంగీత అతడిని ఎంతో బతిమాలింది. నేలపై పడి మొక్కుతూ పక్కకు రమ్మని వేడుకుంది. ‘కొడుకా.. నీ కాళ్లు మొక్కుతాను, వెనక్కి వచ్చేయ్’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయినా కునాల్ మనసు ఏ మాత్రం కరగలేదు. ‘అమ్మా.. ఎవ్వరూ నా మాట వినలేదు. నాకు బతకాలన్న ఆసక్తిలేదు. నా సమస్యలకు పరిష్కారం లేదు. నా జీవితం మెరుగుపడుతున్న నమ్మకం కూడా లేదు’ అని అన్నాడు.
బతిమాలుతుంటే కొడుకు వినటం లేదని భావించిన సంగీత తన చెయ్యి చాచి అతడి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. కొడుకు తన చెయ్యి పట్టుకుని పక్కకు వస్తాడని అనుకుంది. అయితే, కునాల్ మరింత వెనక్కు వెళ్లాడు. దీంతో భయపడిపోయిన తల్లి భయంతో అక్కడినుంచి పక్కకు వచ్చేసింది. గ్రామస్తులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు కునాల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మధ్యాహ్నం 1 గంట సమయంలో తండ్రి మురళీధర్.. కునాల్‌ను రక్షించడానికి అతడికి చాలా దగ్గరగా వెళ్లాడు. కునాల్ వెంటనే కొండపై నుంచి కిందకు దూకేశాడు. కొడుకును పట్టుకునే ప్రయత్నంలో తండ్రి నియంత్రణ కోల్పోయాడు. ఇద్దరూ కలిసి లోతైన లోయలోకి పడిపోయారు. కళ్లెదుటే భర్త, కొడుకు లోయలో పడిపోవడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగీత, కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదే కొండపై నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచింది. ఐఫోన్ ఈఎమ్ఐ వివాదం కారణంగా ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్