Share News

బీబీసీలో 2 వేల ఉద్యోగాల కోత..!

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:37 AM

ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ... పొదుపు చర్యల్లో భాగంగా...

బీబీసీలో 2 వేల ఉద్యోగాల కోత..!

న్యూఢిల్లీ, జూన్‌ 15: ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సంస్థ... పొదుపు చర్యల్లో భాగంగా వచ్చే వారంలో 2000 మందిని సాగనంపనుందని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. బీబీసీలో ప్రస్తుతం 20 వేల మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. బీబీసీ తన వార్షిక బడ్జెట్‌లో 10ు వరకు ఆదా చేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతు మంది వార్తా విభాగంలోనే పనిచేస్తున్నారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టెలివిజన్‌, వెబ్‌సైట్లు, రేడియో, యాప్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి.. ఈ కోతల ప్రభావం ప్రధానంగా వార్తా విభాగంపైనే పడనుంది. ముఖ్యంగా రేడియో విభాగంలో పనిచేసే వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, 20 వేల మందికిపైగా ఉద్యోగులున్న బీబీసీ గత దశాబ్ద కాలంలో చేపట్టనున్న అతిపెద్ద లే ఆఫ్‌ ఇదే కావడం గమనార్హం. బీబీసీ రాబోయే రెండేళ్లలో తన వార్షిక బడ్జెట్‌లో 10 శాతం అంటే 500 మిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.6,343 కోట్లు) ఆదా చేయాలని నిర్ణయించినట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. మరోవైపు, ఈ మెటా కూడా ఈ ఏడాది 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఐకియా సంస్థను పర్యవేక్షించే ఇంటర్‌ ఐకియా గ్రూపు కూడా 850 మంది ఉద్యోగులను తగ్గించినట్టు వెల్లడించింది. స్టార్‌బక్స్‌ మే నెలలో 300 మంది ఉద్యోగులను సాగనంపింది.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 05:37 AM