భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు
ABN , Publish Date - May 29 , 2026 | 12:42 PM
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్‌ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు.
కోల్‌కతా, మే 29: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్‌ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం వందల మంది సరిహద్దు ప్రాంతాలు, ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లే మార్గాలకు చేరుకుంటున్నారు. ఇండియా టుడే కథనం మేరకు.. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోవటానికి ప్రయత్నిస్తున్న అక్రమ వలసదారులు మీడియాతో మాట్లాడుతూ దేశంలోకి ఎలా వచ్చారో చెప్పారు.
కొంతమంది తాము నదులు దాటి భారత దేశంలోకి ప్రవేశించామని చెప్పారు. మరి కొంతమంది తాము మధ్యవర్తుల ద్వారా ఇండియాలోకి వచ్చామన్నారు. చీకటిలో సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించామని తెలిపారు. మధ్యవర్తుల సాయం ఉంటే 10 నిమిషాల్లో దేశంలోకి ప్రవేశించవచ్చని ఓ అక్రమ వలసదారుడు మీడియాకు తెలిపాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో పని చేసే కొంతమంది కార్యకర్తల సాయంతో తాము భారత దేశంలోకి వచ్చామని, వారే తమకు అన్ని డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చారని వెల్లడించారు.
ఆ డాక్యుమెంట్ల కారణంగా తాము భారత్‌లో పలు పథకాల ద్వారా డబ్బులు పొందామని, ఓట్లు కూడా వేశామని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని కుస్తియా జిల్లాకు చెందిన ఓ కార్పెంటర్ మాట్లాడుతూ.. ‘నేను ఇండియాలోకి రావడానికి మధ్యవర్తికి 7 నుంచి 8 వేల రూపాయలు ఇచ్చాను. ఆ మధ్యవర్తి బీఎస్ఎఫ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటాడు. రాత్రి పూట బీఎస్ఎఫ్ సిబ్బంది లేని సమయంలో పెద్ద సంఖ్యలో జనాలను ఇండియాలోకి పంపుతాడు’ అని చెప్పాడు. తాను ఏజెంట్‌కు 20 వేల రూపాయలు ఇచ్చి భారత్‌లోకి వచ్చానని బెంగళూరులో ఉంటున్న ఓ అక్రమ వలసదారుడు మీడియాతో చెప్పాడు.
ఇవి కూడా చదవండి
డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ..
సీఎంఆర్‌ఎఫ్ నిబంధనలు కఠినతరం..