బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా
ABN , Publish Date - Jul 25 , 2026 | 03:07 AM
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగారు. తన పదవీ కాలం ముగియడానికి దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే రాజీనామా..
న్యూఢిల్లీ, జూలై 24: బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగారు. తన పదవీ కాలం ముగియడానికి దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. అనారోగ్య సమస్యల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. అయితే, మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఉన్న సన్నిహిత సంబంఽధాల కారణంతో ప్రస్తుత తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తెచ్చి పదవి నుంచి తప్పించినట్లు అంతర్జాతీయ వార్తసంస్థలు వెల్లడించాయి. 1971 విముక్తి పోరాట యోధుడు అయిన షహాబుద్దీన్.. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మద్దతులో 2023లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News