నేడు బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:22 AM
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది పోలీసులను...
ఢాకా, ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది పోలీసులను ఎన్నికల భద్రత విధులకు కేటాయించారు. 12.77కోట్ల మంది బంగ్లాదేశ్ పౌరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు గాను 299సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News