Share News

భారత్‌లో బంగ్లా వీసా సేవల పునఃప్రారంభం

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:01 AM

సా సర్వీసులతోపాటు భారత్‌లోని రాయబార కార్యాలయాల్లో దౌత్యసేవలను బంగ్లాదేశ్‌ పూర్తిస్థాయిలో...

భారత్‌లో బంగ్లా వీసా సేవల పునఃప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: వీసా సర్వీసులతోపాటు భారత్‌లోని రాయబార కార్యాలయాల్లో దౌత్యసేవలను బంగ్లాదేశ్‌ పూర్తిస్థాయిలో పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అగర్తల, సిలిగురిల్లోని దౌత్య కార్యాలయాలు పునరుద్ధరించారు. దౌత్య కార్యాలయాల వద్ద నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా.. అనివార్య పరిస్థితుల్లో 2025 డిసెంబర్‌ 22 నుంచి ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌, అగర్తలలోని బంగ్లాదేశ్‌ సహాయ హైకమిషన్‌ సేవలను నిరవధికంగా నిలిపివేశారు. తర్వాత కొద్ది రోజులకు సిలిగురిలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని మూసివేశారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే భారత్‌లో దౌత్య, వీసా సర్వీసులను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:01 AM