స్కూల్ హాస్టల్‌లో దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి..
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:44 AM
ప్రైవేట్ స్కూలు హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఘాతుకానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వార్డెన్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూలు హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఘాతుకానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వార్డెన్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బళ్లారిలోని ఓ ప్రైవేట్ స్కూలు హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థులపై 9వ తరగతి విద్యార్థి రాడ్డు, కత్తితో దాడి చేశాడు.
అడ్డు వచ్చిన హాస్టల్ వార్డెన్‌పై కూడా దాడి చేశాడు. దాడి తర్వాత అక్కడినుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ దాడిలో ఓ బాలుడు చనిపోగా.. 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఒక్కడే ఇంత మందిపై ఎలా దాడి చేశాడు? ఎవరైనా అతడికి సాయం చేశారా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు.
నిందితుడికి మానసిక రోగాలు ఏవైనా ఉన్నాయా? లేక డ్రగ్స్ మత్తులో తోటి విద్యార్థులపై ఇలా దాడి చేశాడా? అన్న కోణాలలో కూడా విచారణ సాగిస్తున్నారు. దాడికి దారి తీసిన కారణాల కోసం అన్వేషిస్తున్నారు. దాడిలో మృతి చెందిన బాలుడిని కర్నూలుకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు. నిందితుడికి కత్తి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయంగా ఒత్తిడి తగ్గించేందుకే.. భారత్‌కు అనుమతిపై ట్రంప్ వివరణ..