నా చొరవ వల్లే ఇంటి దొంగలు బయటపడ్డారు
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:50 AM
అయోధ్య రామ మందిరంలో కానుకల చోరీ కేసు దర్యాప్తులో ‘సిట్’ దూకుడు పెంచింది. రామాలయ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్‌ను సిట్ అధికారులు మంగళవారం...
చోరీ నిర్వాకం నా అసిస్టెంట్ టిన్నూదే
రామాలయంలో విరాళాల చోరీపై ‘సిట్’తో ట్రస్ట్ పెద్ద చంపత్ రాయ్
లఖ్‌నవూ, జూన్ 30 : అయోధ్య రామ మందిరంలో కానుకల చోరీ కేసు దర్యాప్తులో ‘సిట్’ దూకుడు పెంచింది. రామాలయ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్‌ను సిట్ అధికారులు మంగళవారం దాదాపు మూడు గంటలపాటు విచారించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా తాము గుర్తించిన అంశాలను ఆయన ముందుపెట్టి, వివరణ తీసుకున్నారు. కానుకల లెక్కింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం, సొమ్ముల గణన నుంచి బ్యాంకులో వాటిని జమ చేసేదాకా.. బహుళ స్థాయుల్లో పనిచేస్తున్న వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండటం వంటి అంశాలపై చంపత్ రాయ్‌ను సూటిగా నిలదీసినట్టు తెలిసింది. అయితే ‘‘ఉల్లంఘనల విషయం తెలియగానే నేనే ముందు స్పందించాను. నా చొరవ వల్లే ఇంటి దొంగలు పట్టుబడ్డారు. కానుకల దుర్వినియోగంలో నాకు ప్రమేయం లేదు. నా సహాయకుడు టిన్నూ యాదవ్ నిర్వాకం ఇది’’ అని చంపత్ రాయ్ సిట్‌తో అన్నట్లు తెలిసింది. కాగా, విచారణకు రావాల్సిందిగా ట్రస్ట్ పెద్దలు అనిల్ మిశ్రా, గోపాల్‌రావులకు సిట్ నోటీసులిచ్చింది.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!