Share News

అటల్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:06 AM

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

అటల్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
Atal Bihari Vajpayee Death Anniversary

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు.


దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడు అటల్‌జీ అని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయికి అపారమైన దూరదృష్టి ఉందని ప్రశంసించారు. ఆయన మాటలు, కృషి తరతరాలకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నాయకత్వం దేశాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై అటల్‌జీ చూపిన దృష్టి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.


మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని ‘సదైవ అటల్‌’ సమాధి వద్దకు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మమతా బెనర్జీ సన్నిహితుడు ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి.. పార్టీ కార్యాలయంలో మృతదేహం..

జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం..

Updated Date - Aug 16 , 2026 | 10:49 AM