Share News

జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం..

ABN , Publish Date - Aug 16 , 2026 | 09:45 AM

జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లు.

జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం దిశగా భారత్.. కీలక భేటీకి రంగం సిద్ధం..
India Germany submarine deal

ఇంటర్నెట్ డెస్క్: భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే కీలక రక్షణ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లు (India Germany submarine deal).


ప్రాజెక్ట్-75(ఐ) కింద భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనున్నారు. వీటిని జర్మనీ సహకారంతో భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, జర్మనీకి చెందిన థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. దేశీయంగా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది (Rs 70000 crore submarine deal).


ఈ ప్రాజెక్టులో జర్మనీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ అనుభవాన్ని భారత్ పొందనుంది (Germany India defence deal). ముఖ్యంగా జలాంతర్గాముల నీటి అడుగున ఎక్కువసేపు పనిచేసే సామర్థ్యాన్ని పెంచే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ కీలక అంశంగా ఉండనుంది. ఇలాంటి సాంకేతికతతో జలాంతర్గాములు తరచుగా నీటి పైకి రాకుండానే ఎక్కువకాలం నీటి అడుగున పనిచేయగలవు. ప్రాజెక్ట్‌పై చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ పలు కారణాలతో ఆలస్యమవుతోంది. తాజాగా ప్రతిపాదనను తుది నిర్ణయం కోసం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ముందు ఉంచే ప్రక్రియ వేగవంతమైనట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

Updated Date - Aug 16 , 2026 | 10:58 AM