అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటే 20% జీతం కట్..
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:17 PM
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే చర్యలు తప్పవన్నారు. రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం డబ్బులు కట్ చేసి మొదటి భార్య బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తామన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే చర్యలు తప్పవన్నారు. రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం డబ్బులు కట్ చేసి మొదటి భార్య బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తామన్నారు. ఉద్యోగి మొదటి భార్య ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆగస్టు 15వ తేదీన గువహటి ఖానాపారా మైదానంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తన అధికారిక ప్రసంగంలో ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి హిమంత మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా అనధికారికంగా రెండో పెళ్లి చేసుకుంటున్న లేదా వేరే మహిళతో సహజీవనం చేస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయని వెల్లడించారు.
విడాకుల కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ తప్పు చేసిన ఉద్యోగి జీతం నుంచి 20 శాతం డబ్బులు కట్ అయి మొదటి భార్య అకౌంట్‌లో పడతాయని తెలిపారు. లీగల్ ప్రొసీడింగ్స్ ముగిసే వరకు మొదటి భార్యకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించినా.. సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించినా ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియాకు మరో షాక్.. 44వేల డాలర్ల ఫైన్‌తో పాటు పాయింట్ల కోత!
హైదరాబాద్‌లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీ.. ఆరుగురి అరెస్ట్