Share News

అసోంలో వరదలు..21మంది మృతి

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:49 AM

అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది మృతి చెందారు...

అసోంలో వరదలు..21మంది మృతి

గువాహటి, జూలై 22: అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది మృతి చెందారు. ఈ ఏడాది వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 5.65 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 872 గ్రామాలు నీటమునగగా, 24,210 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. మరో నాలుగు రోజుల పాటు అస్సాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే దక్షిణ భారత్‌లో మాత్రం వచ్చే వారం పాటు తేలికపాటి వర్షాలే ఉంటాయని స్పష్టం చేసింది.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 05:49 AM