Share News

అరుణాచల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై దాడి

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:41 AM

అప్పర్‌ సియాంగ్‌ బహుళార్థసాధక డ్యామ్‌(సంప్‌) నిర్మాణానికి వ్యతిరేకంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

అరుణాచల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై దాడి
arunachalpradesh

ఈటానగర్‌, అక్టోబరు 24: అప్పర్‌ సియాంగ్‌ బహుళార్థసాధక డ్యామ్‌(సంప్‌) నిర్మాణానికి వ్యతిరేకంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. డ్యామ్‌ నిర్మాణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సియాంగ్‌, అప్పర్‌ సియాంగ్‌, తూర్పు సియాంగ్‌ జిల్లాల్లో 12 గంటల బంద్‌ నిర్వహించారు. ఆ సందర్భంగా గెకు ప్రాంతంలో ఆందోళనకారులపైకి భద్రతాదళాలు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించగా నలుగురు మహిళలకు గాయాలయ్యాయని ప్రచారం జరగడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు రాళ్ల దాడులు, దహనాలు కొనసాగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలింగ్‌ మొయోంగ్‌, ఎమ్మెల్యేలు నినాంగ్‌ ఎరింగ్‌, ఓని పన్యాంగ్‌ల ఇళ్లు, నివాస సముదాయాలపై ఆందోళనకారులు దాడిచేసి, ధ్వంసం చేశారు. జాతీయ జలవిద్యుత్‌ సంస్థ స్థానిక కార్యాలయానికీ ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పసీఘాట్‌ పోలీసుస్టేషన్‌ పైనా దాడి చేశారు. ఏడు వాహనాలను దహనం చేశారు. టిబెట్‌లోని యర్లుంగ్‌ సంగ్పో నదిపై చైనా మెగా డ్యామ్‌ను నిర్మిస్తోంది. దీనికి పోటీగా అరుణాచల్‌లో సియాంగ్‌ నదిపై 10 వేల మెగావాట్ల నుంచి 11 వేల మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ డ్యామ్‌ను భారత్‌ నిర్మిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 03:03 AM