ఆర్మీ శునకం టైసన్‌కు సాహస పురస్కారం
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:20 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సాహస సైనికుల జాబితాలో శునకానికి కూడా స్థానం లభించింది. వివిధ ఆపరేషన్లలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన 75 మంది...
న్యూఢిల్లీ, ఆగస్టు 16: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సాహస సైనికుల జాబితాలో శునకానికి కూడా స్థానం లభించింది. వివిధ ఆపరేషన్లలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన 75 మంది సైనికులను మెన్షన్ ఇన్ డిస్పాచెస్ కింద ఎంపిక చేయగా ఆ జాబితాలో ఆర్మీ శునకం ‘టైసన్’ కూడా ఉంది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకం రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్‌లోని 2 పారా (ప్రత్యేక దళాల్లో) విధులు నిర్వర్తిస్తోంది. ఫిబ్రవరి నెలలో వైట్ నైట్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్ త్రాషీ-1 సమయంలో అసాధారణ సాహసం చూపించింది. రహస్య స్థావరంలో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను గమనించి వారిపై దాడి చేసింది. వారు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచినా తనపట్టు విడవలేదు. టైసన్ కారణంగా ఉగ్రవాదుల ఉనికిని గమనించిన సైనికులు వారిపై ప్రతిదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. టైసన్ నిజమైన సైనికుడు, యోధుడని ప్రశంసించిన ఆర్మీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు