మలేషియా పీఎం నోట.. కిషోర్ కుమార్ పాట.. బ్రిక్స్ వేదికపై అన్వర్ ఇబ్రహీం సందడి..
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:31 AM
అంతర్జాతీయ దౌత్య సమావేశాలకు భిన్నంగా బ్రిక్స్-2026 గాలా డిన్నర్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ పాడిన ఓ సూపర్‌హిట్ పాటను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఆలపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ దౌత్య సమావేశాలకు భిన్నంగా బ్రిక్స్-2026 గాలా డిన్నర్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ పాడిన ఓ సూపర్‌హిట్ పాటను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఆలపించారు. ఆయన పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Anwar Ibrahim viral video).
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌లో అన్వర్ ఇబ్రహీం ఈ పాట పాడారు. 1965లో విడుదలైన 'తీన్ దేవియాన్' సినిమాలోని 'ఖ్వాబ్ హో తుమ్ యా కోయీ హకీకత్' పాటను అన్వర్ ఇబ్రహీం ఆలపించారు. కిషోర్ కుమార్ పాడిన ఈ క్లాసిక్ పాటకు ఎస్.డి. బర్మన్ సంగీతం అందించగా, మజ్రూహ్ సుల్తాన్‌పురి సాహిత్యం అందించారు. తాజాగా పియానో వాయిద్య సహకారంతో అన్వర్ ఈ పాట పాడారు (BRICS 2026 gala dinner).
బ్రిక్స్ సదస్సు సందర్భంగా అన్వర్ ఇబ్రహీం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించారు (Anwar Ibrahim Bollywood). వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్-మలేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓకు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..