అండమాన్ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు!
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:14 AM
అండమాన్ సముద్రంలో ‘ఆయిల్ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది. అండమాన్ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో...
న్యూఢిల్లీ, జూన్ 5: అండమాన్ సముద్రంలో ‘ఆయిల్ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది. అండమాన్ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్ పురి తెలిపారు. ఈ బావి అండమాన్ దీవులకు తూర్పు తీరాన 15 కిలోమీటర్ల దూరంలో, 900 అడుగుల లోతులో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి బావిలో సహజ వాయువు ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆ గ్యాస్ మిశ్రమంలో ఏయే వాయువులు ఎంత శాతం ఉన్నాయన్నది తేల్చడానికి నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. అండమాన్ బేసిన్‌లో ఆయిల్ ఇండియా చేపట్టిన చమురు అన్వేషణలో ఇది రెండో విజయమన్నారు. భారతదేశం చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఈ ఏడాది చివరికల్లా అండమాన్ రీజియన్‌లో మరిన్ని చమురు అన్వేషణ బావులను తవ్వాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది ఆయిల్ ఇండియాకు చెందిన శ్రీవిజయపురం-2 బావిలో గ్యాస్‌ను గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్