Share News

తమిళనాడు AMMK పార్టీలో కుదుపు, ఏకైక ఎమ్మెల్యేపై దినకరన్ వేటు!

ABN , Publish Date - May 12 , 2026 | 03:48 PM

తమిళనాడులో ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమిళనాడు AMMK పార్టీలో కుదుపు, ఏకైక ఎమ్మెల్యేపై దినకరన్ వేటు!
AMMK Expels Sole MLA Kamaraj Over Support to Vijay’s TVK

చెన్నై, మే 12: తమిళనాడులో ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో సంఖ్యాబలం కోసం ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కజగం) పార్టీకి కామరాజ్ మద్దతు తెలిపారనే వార్తలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.

కామరాజ్ స్వచ్ఛందంగా తమకు మద్దతు తెలుపుతూ లేఖ ఇచ్చారని, దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని విజయ్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దినకరన్ ఈ లేఖను, వీడియోను ఫోర్జరీ (Forged) గా కొట్టిపారేశారు. విజయ్ పార్టీ గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తోందని, AI సాంకేతికతను వాడి వీడియోలను సృష్టించారని ఆయన ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, ప్రత్యర్థి పార్టీకి మద్దతు పలికినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, దినకరన్ తన ఏకైక ఎమ్మెల్యేపై వేటు వేశారు.


ఈ పరిణామం తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న విజయ్‌కు ఒక పక్క బలాన్ని ఇస్తుండగా, మరోపక్క దినకరన్ దీనిపై న్యాయపోరాటం, పోలీసు ఫిర్యాదులకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిరోధక చట్టం కింద ఈ అంశాన్ని సవాలు చేస్తామని దినకరన్ హెచ్చరించారు. 'తమది స్వచ్ఛమైన రాజకీయం అని చెప్పుకునే TVK, ఇలాంటి ఫోర్జరీ లేఖలతో గవర్నర్‌ను కలవడం సిగ్గుచేటు.' అని టి.టి.వి. దినకరన్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో అసెంబ్లీలో AMMK ప్రాతినిధ్యం ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్‌కు మరింత దగ్గరవుతున్నారు.


ఇవి కూడా చదవండి...

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఇంద్రకీలాద్రిపై వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2026 | 03:52 PM