కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే!
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:40 AM
వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. దీనిపై వెంటనే దేశ ప్రజలకు, గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయకు...
వందేమాతరాన్ని సోనియా అవమానించారు
ఈ పాపాన్ని ప్రజలు క్షమించరు: అమిత్ షా
న్యూఢిల్లీ/జైపూర్, ఆగస్టు 16: వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. దీనిపై వెంటనే దేశ ప్రజలకు, గీత రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజస్థాన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు మధ్యలోనే ఆపేయాలని సోనియాగాంధీ కోరారు. ఆ దృశ్యాలను అందరూ టీవీల్లో చూశారు. సోనియాజీ.. 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు చేసిన ఈ పాపాన్ని వారు క్షమించరు’’ అని పేర్కొన్నారు. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బంకించంద్ర వారసుడు, బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కూడా డిమాండ్ చేశారు. అయితే, వందేమాతర అంశంలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అమిత్ షా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ వేదికగా అంబేడ్కర్‌ను అవమానించిన వ్యక్తి, 2002 వరకు కూడా త్రివర్ణపతాకాన్ని ఎగురవేయని సంస్థకు చెందిన వ్యక్తి.. ఇప్పుడు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియాగాంధీ కోరారని తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు