Share News

అజిత్‌ దోవల్‌కు అమెరికా సమన్లు!

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:43 AM

ఉగ్రవాది గుర్పత్‌వంత్‌ సింగ్‌ పన్నూ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో భారత ప్రభుత్వానికి అమెరికా విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.

అజిత్‌ దోవల్‌కు అమెరికా సమన్లు!
Ajithdoval

  • రా మాజీ అధిపతి సమంత్‌ గోయల్‌కు కూడా..

  • ఉగ్రవాది పన్నూ ‘హత్యకు కుట్ర’ కేసులో జారీ

  • గత నెల 9న వాషింగ్టన్‌లోని భారత ఎంబసీకి సమన్లు

  • తీవ్రంగా ఖండించిన విదేశాంగ శాఖ

  • భారతీయ ఉన్నతాధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 10: ఉగ్రవాది గుర్పత్‌వంత్‌ సింగ్‌ పన్నూ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో భారత ప్రభుత్వానికి అమెరికా విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. పన్నూ ఈ కేసులో ప్రతివాదులుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌(రా) మాజీ అధిపతి సమంత్‌ గోయల్‌తోపాటు పలువురు భారతీయ అధికారుల పేర్లను పేర్కొన్నాడు. తద్వారా వీరందరికీ అమెరికా సమన్లు జారీ చేసినట్లయ్యింది. గత నెల 9వ తేదీన సదరు సమన్లను అమెరికా విదేశాంగశాఖ.. వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి పంపించింది. గుర్పత్‌వంత్‌ సింగ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. తనను హత్య చేయించటానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ గతంలో ఆయన కేసు దాఖలు చేశాడు. నిఖిల్‌గుప్తా అనే భారతీయుడిని ఈ మేరకు నియమించారని పేర్కొన్నాడు. ఈ కేసులో అమెరికాలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో నిఖిల్‌గుప్తా 2023 జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో అరెస్టయ్యాడు. అతడిని ఆ దేశం అమెరికాకు అప్పగించింది. కాగా, భారతీయ అధికారులకు అమెరికా సమన్లు జారీ చేయటాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది.

ఇవి కూడా చదవండి..

వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ

ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ

Updated Date - Nov 11 , 2026 | 02:50 AM