3 లక్షల కోట్లు.. 5 గిగావాట్ల డేటాసెంటర్లు..
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:17 AM
ఆసియా-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థ ‘ఎయిర్‌ట్రంక్’ భారత్‌లో 2030 నాటికి రూ.3 లక్షల కోట్ల భారీ...
దేశంలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ‘ఎయిర్‌ట్రంక్’
న్యూఢిల్లీ, జూన్ 5: ఆసియా-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థ ‘ఎయిర్‌ట్రంక్’ భారత్‌లో 2030 నాటికి రూ.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎయిర్‌ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో శుక్రవారం సమావేశమైన అనంతరం.. ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సంస్థ ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశవ్యాప్తంగా 5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిద్వారా భారత్ గ్లోబల్ ఏఐ హబ్‌గా ఎదుగుతుందని, కొత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు. ఎయిర్ ట్రంక్ సంస్థ సీఈవో ఖుదా మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ఏఐ శక్తి కేంద్రంగా ఎదిగేందుకు అవసరమైన స్థాయి, ప్రతిభ, ఆశయం భారత్‌కు ఉన్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్