ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
ABN , Publish Date - May 13 , 2026 | 05:12 PM
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం ఆరు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా, ఢిల్లీ-మాలే రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమలులో ఉంటుందని తెలిపింది.
నష్టాల దృష్ట్యా ఇప్పటికే కొన్ని మార్గాల్లో సర్వీసులను ఎయిర్ ఇండియా తగ్గించింది. ఆ నిర్ణయాన్ని మరికొన్ని రూట్లకు విస్తరిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా సంస్థ ప్రతి నెలా 1,200కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనుంది. వీటిలో ఉత్తర అమెరికాకు వారానికి 33, ఐరోపాకు 47, యూకేకు 57, ఆస్ట్రేలియాకు 8, ఫార్ ఈస్ట్, ఆగ్నేయాసియా, సార్క్ ప్రాంతాలకు 158 విమానాల చొప్పున నడవనున్నాయి. అలాగే మారిషస్‌కు వారానికి ఏడు విమాన సర్వీసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, నష్టాల దృష్ట్యానే ఎయిర్ ఇండియా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..