Share News

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:18 PM

భారత్ వేగవంతమైన వృద్ధికి ఏఐ సమ్మిట్‌ నిదర్శనమని, ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 20) వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 జరగనుంది.

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
Narendra Modi AI Summit

భారత్ వేగవంతమైన అభివృద్ధికి ఏఐ సమ్మిట్‌ నిదర్శనమని, ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 20) వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ప్రపంచ నాయకులను, ప్రతినిధులను, పరిశ్రమల నాయకులను స్వాగతించారు (Narendra Modi AI Summit).


'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' (అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం) అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమ్మిట్ గురించి ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేథస్సును వినియోగించుకోవడం మన ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఇది ప్రగతిశీల భవిష్యత్తును రూపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలన వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ( India AI growth).


ఈ సమ్మిట్ వల్ల డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తివంతమైన స్టార్టప్‌ల ఏర్పాటు, అత్యాధునిక పరిశోధనలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యత మరింత పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు (PM Modi speech). కాగా, శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌లో 45 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..

Updated Date - Feb 16 , 2026 | 01:06 PM