Share News

ఏఐ సాయంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ తొలగింపు

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:58 AM

లండన్‌లోని న్యూరాలజిస్టులు కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. రోగి కంటి చూపుపై...

ఏఐ సాయంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ తొలగింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: లండన్‌లోని న్యూరాలజిస్టులు కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయవంతంగా బ్రెయిన్‌ ట్యూమర్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. రోగి కంటి చూపుపై ఎలాంటి ప్రభావం పడకుండా మెదడు నుంచి కణితిని తొలగించారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన న్యూరాలజీ అండ్‌ న్యూరో సర్జరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్‌ జరిగింది. రోగి పేరు హిబ్బెర్ట్‌(48). ఆయన మెదడులోని పిట్యుటరీ గ్రంధి దగ్గర 11మిల్లీమీటర్ల పరిమాణంలో కణితి ఏర్పడింది. దీనివల్ల ఆయన కంటి చూపును నియంత్రించే నరాలపై ఒత్తిడి పడి, ఆయన చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఏర్పడింది. డాక్టర్లు ఎండోస్కోపి కెమెరా సాయంతో ముక్కు ద్వారా ట్యూమర్‌ను తొలగించే క్రమంలో ఏఐ ఆ కెమెరాలోని వీడియో ఫుటేజీని విశ్లేషిస్తూ వైద్యులకు సాయం చేసింది. పిట్యుటరీ గ్రంఽధి చుట్టుపక్కల అత్యంత కీలకమైన రక్తనాళాలు, నరాలు ఉంటాయి. ఆపరేషన్‌లో కొంచెం తేడా వచ్చినా చూపు పూర్తిగా పోవచ్చు. లేదా ప్రాణాపాయం సంభవించవచ్చు. ఈ పరిస్థితుల్లో ఏఐ ఆ సున్నితమైన నరాలను, రక్తనాళాలను కలర్‌ కోడింగ్‌ ద్వారా వేరు చేసి చూపిస్తూ సర్జన్లకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడంలో సాయం చేసింది. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ హాక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:58 AM