దీదీ.. కాంగ్రెస్‌లోకి వచ్చేయండి
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:46 AM
టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆహ్వానించారు
మమతకు అధీర్ రంజన్ ఆహ్వానం
కోల్‌కతా, అక్టోబరు 1: టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆహ్వానించారు. వేరుకుంపటి పెట్టుకోగా మిగిలిన టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీలోకి రావాలని, బెంగాల్లో ఆమె నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మూడు దశాబ్దాల కిందట కాంగ్రె్‌సను వదిలేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఏర్పాటు చేసుకున్న మమత.. 2011 నుంచి ఈ ఏడాది మే 4 వరకు బెంగాల్ సీఎంగా 15 ఏళ్లు పాలించి.. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. అనంతరం చీలికలు రావడంతో మమత పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ ఆమెను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. అయితే ఇలాంటి ప్రతిపాదన కాంగ్రెస్ నాయకత్వం నుంచి వస్తేనే తమ పార్టీ పరిశీలిస్తుందని టీఎంసీ సీనియర్ నేత సౌగతారాయ్ తెలిపారు. అభిషేక్ బెనర్జీ తమ నాయకుడని.. ఆయన లేకుండా ఎలాంటి నిర్ణయాలూ ఉండవని స్పష్టంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు