షావుకారు జానకికి అస్వస్థత
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:21 AM
సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో...
చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో పాటు వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో జానకి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..