Share News

రాజస్థాన్‌లో అభిజీత్‌ దీప్కేపై దాడి

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:05 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేపై రాజస్థాన్‌లో దాడి జరిగింది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌...

రాజస్థాన్‌లో అభిజీత్‌ దీప్కేపై దాడి

జైపూర్‌, జూన్‌ 15: కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేపై రాజస్థాన్‌లో దాడి జరిగింది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని జైపూర్‌లో అమరవీరుల స్మారకం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా దీప్కేను ఓ మద్దతుదారుడు తన భుజాల మీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకువస్తుండగా కొంతమంది ఆయన వైపు దూసుకువచ్చారు. అందులో కొంతమంది దీప్కేను పలుమార్లు చెంపదెబ్బ కొట్టాడు. మిగతావారు కిందకి లాగడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీజేపీ మద్దతుదారులు వారిని దూరంగా లాక్కెళ్లారు. కొందరిని కొట్టారు. దీంతో, అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దాడిపై దీప్కే స్పందించారు. ‘‘ఒకటి..రెండు కాదు..ఇలాంటివి వంద దాడులు చేసినా నా నోరు మూయించలేరు’’ అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 05:05 AM