పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. 40 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా..
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:42 PM
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు ప్రారంభించింది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కసరత్తు ప్రారంభించింది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్కు కోట్కపురా టికెట్ కేటాయించారు. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది (AAP Candidate List 2027).
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్టీ పంజాబ్ ఇన్ఛార్జి మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించిన అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోదంతో శనివారం తొలి జాబితాను విడుదల చేశారు. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది (Punjab Assembly Elections 2027).
తొలి జాబితాలో ముఖ్యమంత్రి, మంత్రులకు చోటు కల్పించారు (AAP Punjab Candidates). లూధియానా వెస్ట్ నుంచి పోటీ చేయనున్న మంత్రి సంజీవ్ అరోరా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనకు పార్టీ మరోసారి టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్లో ప్రస్తుత అసెంబ్లీ గడువు 2027 మార్చి 16తో ముగియనుంది. ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంఘం ఇంకా అధికారిక షెడ్యూల్ ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..