Share News

ఆ పాత్రకు స్ఫూర్తి వాంగ్‌చుక్ కాదు.. పుకార్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:36 AM

లడఖ్‌కు చెందిన ఇంజినీర్, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా త్రీ ఇడియట్స్‌లోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర తెరకెక్కిందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ ప్రచారానికి ఆమిర్ ఖాన్ పులుస్టాప్ పెట్టారు.

ఆ పాత్రకు స్ఫూర్తి వాంగ్‌చుక్ కాదు.. పుకార్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్
Aamir Khan

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా దేశ వ్యాప్తంగా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2009లో విడుదలైన ఈ సినిమాలో ఆమిర్ ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్రలో అద్భుతంగా నటించారు. లడఖ్‌కు చెందిన ఇంజినీర్, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగానే ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర తెరకెక్కిందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ ప్రచారానికి ఆమిర్ ఖాన్ పులుస్టాప్ పెట్టారు. ఫున్సుఖ్ వాంగ్డు పాత్రకు సోనమ్ వాంగ్‌చుక్ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.


తాజాగా, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (LIFF)లో పాల్గొన్న ఆమిర్ ఖాన్.. సోనమ్ వాంగ్‌చుక్ గురించి మాట్లాడుతూ.. ‘త్రీ ఇడియట్స్ సినిమా సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా తెరకెక్కిందన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. త్రీ ఇడియట్స్ సినిమా తీస్తున్న సమయంలో నాకు కానీ, మా సినిమా స్టోరీ రాస్తున్న రైటర్లకు కానీ సోనమ్ వాంగ్‌చుక్ ఎవరో తెలీదు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పని చాలా గొప్పది. అతడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. నిరాహార దీక్ష ఆపేస్తే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు’అని అన్నారు.


ఇవి కూడా చదవండి

కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు

కోవిడ్ కేసులు.. మాస్క్ మళ్లీ తప్పనిసరిగా మారుతుందా?

Updated Date - Jul 17 , 2026 | 11:43 AM