దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసుల పెండింగ్
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:47 PM
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు. అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికలోని వివరాల మేరకు..
సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు పెండింగ్‌లో ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు.. మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులో ఉన్నాయి. ఇక, లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది. లోక్‌సభలోని 170 మంది సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి
విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు
శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?