Share News

బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం..

ABN , Publish Date - Jun 11 , 2026 | 09:45 PM

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం..
West Bengal EVM fire

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఒక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇది విధ్వంసక చర్య కావొచ్చని బెంగాల్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమ భట్టాచార్య అనుమానం వ్యక్తం చేశారు (West Bengal EVM fire).


కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ భవనంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉంచిన వేలాది ఈవీఎంలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 24 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈవీఎంలను ఉంచిన ప్రాంతంలోనే మంటలు తీవ్రంగా వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది (4000 EVMs destroyed).


'అగ్నిప్రమాదంలో దాదాపు 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి (Kolkata fire EVM sabotage). ఈ ఈవీఎంలను ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పది నియోజకవర్గాల్లో ఉపయోగించారు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదు. ఏదైనా కుట్ర జరిగిందా అనే అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి స్పష్టత వస్తుంది' అని బెంగాల్ మంత్రి కౌశిక్ చౌధురీ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..


మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 11 , 2026 | 09:47 PM