ఈరోజు రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:51 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఈరోజు రాత్రి ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం' అని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఈరోజు రాత్రి ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం' అని తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు. ట్రంప్ ప్రకటన పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతలను మరింత పెంచింది (Donald Trump Iran).
కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా, ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు, సహజవాయు మౌలిక వసతులపై కూడా నియంత్రణ సాధించే దిశగా అడుగులు వేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపం సహా పలు చమురు మౌలిక వసతులను నియంత్రణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో వెనెజువెలాపై అనుసరించిన వ్యూహంతోనే ఇరాన్‌ను నియంత్రణలోకి తీసుకుంటామన్నారు (Iran oil infrastructure).
'ఇరాన్ నౌకాదళం, వాయుసేన, రాడార్, క్షిపణి నిరోధక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి చెందిన అన్ని వ్యవస్థలు ఇప్పటికే నాశనమయ్యాయి (Trump warning Iran). సమీప భవిష్యత్తులో ఖర్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు కేంద్రాలను స్వాధీనం చేసుకుని ఆయా మార్కెట్లపై నియంత్రణ సాధిస్తాం. వెనెజువెలాలో చేసిన మాదిరిగానే ఇరాన్‌లో కూడా మా ప్రణాళిక ఉంటుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..