Share News

భారత్-ఎకు భంగపాటు.. అఫ్గానిస్థాన్-ఎ చేతిలో ఓటమి..

ABN , Publish Date - Jun 11 , 2026 | 07:28 PM

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ బ్యాటర్లు చెలరేగి ఆడినప్పటికీ, బౌలర్లు విఫలమయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్-ఎకు భంగపాటు.. అఫ్గానిస్థాన్-ఎ చేతిలో ఓటమి..
India A vs Afghanistan A

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. యువ బ్యాటర్లు చెలరేగి ఆడినప్పటికీ, బౌలర్లు విఫలమయ్యారు. దీంతో అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆటను 49 ఓవర్లకు కుదించారు (India A vs Afghanistan A).


రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటర్లలో ప్రభ్‌ సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్‌ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలు సాధించారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లో 44 పరుగులు చేసి మరోసారి తన దూకుడు చూపించాడు. 49 ఓవర్లలో భారత్-ఎ 349 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో అఫ్గాన్-ఎ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించి, 294 పరుగుల లక్ష్యంగా నిర్ణయించారు (Afghanistan A win).


ఛేజింగ్‌లో అఫ్గాన్ టాపార్డర్ బ్యాటర్లు చక్కగా బ్యాటింగ్ చేశారు (Tri Nation Series 2026). ఇమ్రాన్ (75 నాటౌట్), బహీర్ షా (51 నాటౌట్) అర్ధశతకాలు సాధించారు. అఫ్గాన్-ఎ 25.5 ఓవర్లలో 177/2తో ఆడుతున్న సమయంలో మరోసారి వర్షం మొదలైంది. వర్షం ఆగకపోవడంతో డీఎల్‌ఎస్ ప్రకారం అఫ్గాన్-ఎ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు. భారత్-ఎ బౌలర్లలో అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..


మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 11 , 2026 | 07:28 PM