మావోయిస్టుల డంప్‌లో 33 బంగారు బిస్కెట్లు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:43 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది.
మావోయిస్టుల డంప్‌లో 33 బంగారు బిస్కెట్లు
చర్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది. భైరంగడ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంద్రావతి నది అడవుల్లో శుక్రవారం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం బీజాపూర్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉమేశ్‌ప్రసాద్ గుప్తా వెల్లడించారు. తనిఖీల్లో ఇంద్రావతి నదికి సమీపంలో ఒక డంప్‌ను గుర్తించామని, అందులో ఇనుప పెట్టెలో దాచి ఉంచిన 3.84 కిలోల బరువున్న 33 బంగారు బిస్కెట్లు, 24.22 లక్షల నగదు లభ్యమయ్యాయని చెప్పారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ ప్రస్తుత ధర ప్రకారం రూ.4.90 కోట్లకు పైనే ఉంటుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..