Share News

18 ఏళ్లకే ప్రొఫెసర్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:48 AM

ఏ డిగ్రీలో జాయిన్‌ అవ్వాలి? ఏ కాలేజీ బావుంటుంది? అని 18 ఏళ్ల వయసులోని యువత సాధారణంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ వయసులోనే ఉన్న అమెరికాకు చెందిన నాథన్‌ థామస్‌ ఏకంగా ప్రొఫెసర్‌గా...

18 ఏళ్లకే ప్రొఫెసర్‌

  • 306 ఏళ్ల గిన్నిస్‌ రికార్డు బ్రేక్‌

  • ప్రపంచంలోనే చిన్న వయసు

  • పురుష ప్రొఫెసర్‌గా నాథన్‌ థామస్‌

  • అమెరికా కాలేజీలో ఇంజనీరింగ్‌ పాఠాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏ డిగ్రీలో జాయిన్‌ అవ్వాలి? ఏ కాలేజీ బావుంటుంది? అని 18 ఏళ్ల వయసులోని యువత సాధారణంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ వయసులోనే ఉన్న అమెరికాకు చెందిన నాథన్‌ థామస్‌ ఏకంగా ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించి గిన్నీస్‌ ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. 1717లో స్కాంట్లాండ్‌కు చెందిన గణిత నిపుణుడు కోలిన్‌ 19ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేశాడు. 18 ఏళ్ల 346 రోజుల వయసులో ఫ్లోరిడాకు చెందిన టీనేజర్‌ నాథన్‌ థామస్‌ మియామీ డేడ్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 10 ఏళ్ల వయసులో స్కూల్లో ఉన్నప్పుడే డ్యూయల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమం కింద మియామీ కాలేజీలో థామస్‌ ప్రవేశం పొందాడు. 14ఏళ్ల వయసులో ఫ్లోరిడా వర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌, మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తిచేశాడు. తర్వాత మియామీ కాలేజీకి తిరిగి వచ్చి 2023లో సీవోపీ 2270: సీ ఫర్‌ ఇంజనీర్స్‌ కోర్సులో ప్రొఫెసర్‌గా సీ ప్రోగ్రామింగ్‌ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 05:48 AM