Share News

గ్రేట్‌ సిక్స్‌టీన్‌!

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:24 AM

పదహారేళ్ల అబ్బాయి ఎవరైనా చేతి ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడుగుతారు. ఆ అబ్బాయి మాత్రం తన తండ్రినే ఉద్యోగిగా నియమించుకొని నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తున్నాడు!...

గ్రేట్‌ సిక్స్‌టీన్‌!

  • 16 ఏళ్ల కేరళ బుడ్డోడు ఏఐ స్టార్టప్‌ పెట్టాడు

  • 2 లక్షల జీతంతో తండ్రికే ఉద్యోగమిచ్చాడు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పదహారేళ్ల అబ్బాయి ఎవరైనా చేతి ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడుగుతారు. ఆ అబ్బాయి మాత్రం తన తండ్రినే ఉద్యోగిగా నియమించుకొని నెలకు రూ.2 లక్షల జీతం ఇస్తున్నాడు! కేరళలోని పతనంతిట్టకు చెందిన రౌల్‌ జాన్‌ అజు అనే విద్యార్థే ఆయన! రౌల్‌ ప్రస్తుతం కామర్స్‌ గ్రూప్‌తో 12వ తరగతి చదువుతున్నారు. నెలకు రూ.2లక్షల జీతం ఇచ్చేంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వస్తోంది? అంటారా? రౌల్‌ సొంతంగా ఏఐ టెక్నాలజీస్‌ పేరుతో ఓ ఏఐ స్టార్ట్‌పను స్థాపించాడు. ఇందులో ఆయన తండ్రి సహా 16 మంది పనిచేస్తున్నారు. తన స్టార్టప్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చారు రౌల్‌. ఇప్పటిదాకా 15 ఏఐ సాధనాలను అభివృద్ధి చేశారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే రౌల్‌ ఎవ్వరి సాయం లేకుండా స్వీయ ఆసక్తితో ఏఐ నేర్చుకోవడం మొదలుపెట్టారు. 12ఏళ్ల వయసులో తొలిసారిగా రోబోను రూపొందించారు. ప్రజాసేవలో ఏఐని ఎలా అనుసంధానించాలనే విషయమ్మీద రౌల్‌.. కేరళ, దుబాయ్‌ ప్రభుత్వాలకు సలహాలిచ్చారు. రౌల్‌ తండ్రి జోసెఫ్‌ అమెజాన్‌, ఆడోబ్‌, విప్రో, ఐబీఎం వంటి కంపెనీల్లో పనిచేశారు. ఆయన్ను తన స్టార్ట్‌పలో ఉద్యోగిగా రౌల్‌ నియమించుకున్నారు. రౌల్‌ స్థాపించిన ఏఐ టెక్నాలజీస్‌ థింక్‌ క్రాఫ్ట్‌ అకాడమీని నడుపుతోంది. ఇక్కడ ఐఐటీలు, ఐఐఎంలు, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:24 AM