తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:19 AM
కేరళలోని అలప్పుజలో 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో సొంత తాతను హత్య చేయించింది. ఆగస్టు 15న బాలిక తాత (67) ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. బాలిక 17 ఏళ్ల స్నేహితుడు, మరో ముగ్గురు...
ఇంట్లోకి 17 ఏళ్ల స్నేహితుడు, మరో ముగ్గురు బాలుర ప్రవేశం
వృద్ధుడిని హింసించి చంపిన నలుగురు
4.5 తులాల బంగారం అపహరణ
తిరువనంతపురం, ఆగస్టు 19: కేరళలోని అలప్పుజలో 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో సొంత తాతను హత్య చేయించింది. ఆగస్టు 15న బాలిక తాత (67) ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. బాలిక 17 ఏళ్ల స్నేహితుడు, మరో ముగ్గురు బాలురు కలిసి బాత్‌రూం కిటికీ గుండా ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధుడి చేతులు, కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి తలను గోడకేసి కొట్టి చంపారు. తాత హత్యకు పథకం వేసిన మనుమరాలు వీడియో కాల్ ద్వారా ఈ హత్యోదంతాన్నంతా చూసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తనకు సెల్‌ఫోన్ కొనుక్కునేందుకు, స్నేహితుడికి ద్విచక్రవాహనం కొనుక్కునేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లోని 4.5 తులాల బంగారాన్ని వారు ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పైగా ఈ టీనేజర్లకు మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన రోజే ఇంటికొచ్చిన బాలిక ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. ఆ మర్నాడు పెద్దాయన ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూసేసరికి మృతదేహం కనిపించింది. అప్పటికీ కించిత్తు కూడా చలించని ఆ బాలిక.. తాను బడికి వెళ్లాలని, పరీక్ష రాయల్సి ఉంద ని హడావుడి చేసినట్లు స్థానికులు తెలిపారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. నిందితుల్లో 16-18 ఏళ్ల వయసున్న వారిని మేజర్లుగా పరిగణించి విచారించేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..