ఉక్రెయిన్ తీరంలో నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:56 AM
ఉక్రెయిన్‌లోని చోర్నోమార్స్క్ పోర్టులో చిక్కుకున్న ఎంవీ ఆమిర్1 అనే సరకు రవాణా నౌకలో 13 మంది భారతీయులు సహా 15 మంది నావికులు ఇరుక్కుపోయారు.
న్యూఢిల్లీ, జూలై 28: ఉక్రెయిన్‌లోని చోర్నోమార్స్క్ పోర్టులో చిక్కుకున్న ఎంవీ ఆమిర్1 అనే సరకు రవాణా నౌకలో 13 మంది భారతీయులు సహా 15 మంది నావికులు ఇరుక్కుపోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పోర్టు సమీపంలో క్షిపణి, డ్రోను దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నౌకలోని నావికులంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నావికులను కాపాడాలని, సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎ్‌ఫఎ్‌సయూఐ) కేంద్ర ప్రభుత్వాన్ని, షిప్పింగ్ కంపెనీని, ఇతర అధికారులను అభ్యర్థించింది. నౌకకు అతి సమీపంలోనే క్షిపణి దాడులు జరుగుతున్నాయని సిబ్బంది భయాందోళనలో ఉన్నారని విజ్ఞప్తి చేసింది.