12 ఏళ్లకే ఏఐ స్టార్టప్!
ABN , Publish Date - Jul 13 , 2026 | 06:01 AM
సాధారణంగా 12ఏళ్ల వయసులో పిల్లలు హోంవర్క్ చేసుకుంటూనో, స్నేహితులతో ఆటపాటలతోనో కాలం గడిపేస్తుంటారు. అయితే కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన భారత సంతతి చిన్నారి...
‘వోక్సా’ వాయిస్ అసిస్టెంట్‌ను రూపొందించిన మాన జంపాల
భారత్, కెనడా, కంబోడియాల్లో సేవలు
న్యూఢిల్లీ, జూలై 12: సాధారణంగా 12ఏళ్ల వయసులో పిల్లలు హోంవర్క్ చేసుకుంటూనో, స్నేహితులతో ఆటపాటలతోనో కాలం గడిపేస్తుంటారు. అయితే కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన భారత సంతతి చిన్నారి మాన జంపాల మాత్రం ఇంత చిన్న వయసులోనే ఒక ఏఐ స్టార్ట్‌పను ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడుపుతోంది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఆమె ‘వోక్సా’ అనే ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్/ రిసెప్షని్‌స్టను రూపొందించడం ద్వారా అతి పిన్న వయస్కురాలైన ఏఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్ నుంచి వచ్చే కాల్స్‌ను మిస్ కాకుండా నివారించడంలో వోక్సా సహాయపడుతుంది. ఇది ఇప్పటికే భారత్, కెనడా, కంబోడియా దేశాల్లో విజయవంతంగా సేవలు అందిస్తోంది. తొమ్మిదేళ్ల వయసులోనే కోడింగ్, పైథాన్ నేర్చుకున్న ఈ బాల మేధావి 11 ఏళ్లు వచ్చేసరికి సొంతంగా ఏఐ ఉత్పత్తులను రూపొందించడం ప్రారంభించింది. తన తండ్రి పనిచేసే కార్యాలయంలో సిబ్బంది బిజీగా ఉండటంతో కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించలేకపోవడం, తద్వారా వ్యాపార అవకాశాలు దెబ్బతినడాన్ని మాన గమనించింది. ఈ పరిశీలనే వోక్సా రూపకల్పనలో ఆమెకు స్ఫూర్తినిచ్చింది. ఈ వర్చువల్ రిసెప్షనిస్ట్ కంపెనీల తరఫున 24 గంటలూ అందుబాటులో ఉండి, కస్టమర్ కాల్స్‌కు సమాధానాలు ఇస్తుంది. అపాయింట్‌మెంట్లు బుక్ చేస్తుంది. ఆర్డర్లు తీసుకొని ఫాలోఅప్ చేస్తుంది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు