హిమంత మంత్రివర్గ విస్తరణ.. 12 మందికి చోటు
ABN , Publish Date - Jun 05 , 2026 | 03:26 PM
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన మంత్రివర్గాన్ని శుక్రవారంనాడు విస్తరించారు. కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన మంత్రివర్గాన్ని శుక్రవారంనాడు విస్తరించారు. కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. గువాహటిలోని లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణస్వీకారం చేయించారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో కలిపి మంత్రి మండలి సభ్యులసంఖ్య 17కు చేరింది.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో అశ్విని రాయ్ సర్కార్, అశోక్ సంఘాల్, బిమల్ బోరా, బిశ్వజిత్ డైమరీ, జయంత మల్లా బరువా, కౌషిక్ రాయ్, కేషబ్ మహంతా, కిృష్ణేందు పాల్, నీలిమా దేవి, పిజుష్ హజారికా, రనోజ్ పెగు, సుశాంత బోర్గో హైన్ ఉన్నారు. బిన్న భాషా సమ్మేళనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రులు వివిధ భాషల్లో ప్రమాణస్వీకారం చేశారు. అస్సామీలో పలువురు ప్రమాణం చేయగా, బిమల్ బోరా సంస్కృతంలో, కౌషిక్ రాయ్ హిందీలో, కృష్ణేందు పాల్ బెంగాలీలో ప్రమాణం చేశారు.
అస్సాంకు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మే 12న ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతలు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అసోం గణపరిషత్ (ఏజీపీ) అధ్యక్షుడు అతుల్ బోరా, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) నేత చరణ్ బోరో మంత్రులుగా ప్రమాణం చేశారు. ఖనకపురలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 129 మంది సభ్యుల అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా 19 మంది మంత్రులకు మంత్రివర్గంలో అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభకు మమతా బెనర్జీ .. బహరాంపుర్ నుంచి పోటీకి యోచన
గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్