పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:25 PM
కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.
భువనేశ్వర్, మార్చి 15: ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు. 1 AK-47, 4 SLRలు, 1 INSAS రైఫిల్, 1 12-బోర్ గన్, 2 సింగిల్ షాట్ ఆయుధాలను వీరు అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన నక్సలైట్లలో చాలా మంది బస్తర్ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ 11 మంది నక్సలైట్లపై ప్రభుత్వం గతంలో 1 కోటి 34 లక్షల రూపాయల భారీ నగదు బహుమతిని (ఇనామ్) ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది..
బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తమ ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. లొంగిపోయిన వారిలో 44 మంది మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు వీరి నుంచి భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 3.61 కోట్ల రూపాయల నగదు. 1.64 కోట్లు విలువ చేసే బంగారం ఉంది. ఇక, లొంగిపోయిన వారిపై 3.29 కోట్ల రూపాయల రివార్డు ఉంది.
ఇవి కూడా చదవండి
ఫోన్ నెంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ