-
-
Home » Mukhyaamshalu » National International Latest viral trending Andhra Pradesh and Telangana ABN Andhra Jyothy Breaking Live Updates on Jan 14th siva
-
Breaking News: అల్వాల్‌లోని కార్ల షోరూంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - Jan 14 , 2026 | 10:37 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 14, 2026 12:56 IST
హైదరాబాద్: అల్వాల్‌లోని కార్ల షోరూంలో అగ్నిప్రమాదం
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
-
Jan 14, 2026 12:50 IST
తమిళనాడు: కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
గోవులకు పూజ చేసి.. పొంగల్ వండిన ప్రధాని మోదీ
పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు
-
Jan 14, 2026 12:08 IST
నాగోబా జాతర వెబ్‌సైట్ ప్రారంభం..
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరైన నాగోబా జాతర అధికారిక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. కేస్లాపూర్‌లోని ఆలయ దర్బార్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ అఖిల్ మహాజన్ లు సైట్ ను ప్రారంభించారు. ఇందులో జాతర చరిత్ర, వివరాలు, పూజా విధానం తదితర సమాచారాన్ని పొందుపర్చారు.
-
Jan 14, 2026 11:24 IST
మేడ్చల్: భర్త చేసిన అప్పులు తీర్చేందుకు భార్య చైన్ స్నాచింగ్
రెండేళ్ల క్రితం వరంగల్‌కు చెందిన రాజేష్-అనితారెడ్డి ప్రేమ వివాహం
భర్త అప్పు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్ చేయాలని భార్య నిర్ణయం
మియాపూర్‌లో మహిళ మెడ నుంచి అరతులం గొలుసు లాక్కెళ్లిన అనితారెడ్డి
సీసీ ఫుటేజ్ ఆధారంగా అరగంలోనే నిందితురాలిని పట్టుకున్న పోలీసులు
-
Jan 14, 2026 10:39 IST
అమలాపురంలోని రంగాపురంలో భారీ భోగి దండ.
భోగి దండ @ 1/2 కిలోమీటర్
20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండ.
ఆవు పేడతో 20 రోజులపాటు గ్రామస్తులతో కలిసి శ్రమించి భోగి దండ తయారుచేసిన విశ్వనాథరాజు కుటుంబం.
తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు ఆరు సంవత్సరాల నుంచి భారీ భోగి దండల తయారీ.
గ్రామస్తులందరితో కలిసి ఈ భోగి దండలు భోగి మంటలో వేసిన విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు.
ఈ భోగి దండ భోగి మంటలు వేసేందుకు తరలివచ్చిన గ్రామస్తులతో గ్రామంలో సందడి.
-
Jan 14, 2026 10:38 IST
ఢిల్లీ ఏపీభవన్‌లో మూడురోజులపాటు సంక్రాంతి సంబరాలు
ఏపీ సంప్రదాయాలను పరిచయం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు.
ఉత్సవాల్లో ఏపీ కళావారసత్వ సంపదకు ప్రతీకలైన అమలాపురం గరగళ్లు నృత్యం.
తప్పెటగూళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు సినీ సంగీత విభావరి.
-
Jan 14, 2026 10:37 IST
థాయ్‌లాండ్‌లో ఘోరప్రమాదం
క్రేన్ జారి రైలుపై పడటంతో పట్టాలు తప్పిన బోగీలు
ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు మృతి